See which of your colleagues or former colleagues are already on Loksatta Fans: Check out the Contact Finder
News »Browse Articles » లోక్‌సత్తాతో బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ పొత్తు
+3
Vote Vote

లోక్‌సత్తాతో బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ పొత్తు

Views 55 Views    Comments 2 Comments    Share Share    Posted 25-03-2009  
లోక్‌సత్తా పార్టీ బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌తో పొత్తు కుదుర్చుకున్నట్లు ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త జయప్రకాష్ నారాయణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కోట్లు ఖర్చు పెట్టే వారికే సీట్లను కేటాయిస్తూ అదే సామాజిక న్యాయమని భావిస్తున్నాయని ఆయన విమర్శించారు.

బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌కు 14 అసెంబ్లీ సీట్లను కేటాయించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంగళవారం ఆయన బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు పాటూరి రామకృష్ణయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఇదిలావుండగా అణగారిన కులాల్లో ఏ కొద్దిమందో కాకుండా, ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేలా చేయడమే తమ పార్టీ సామాజిక న్యాయమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఏ పార్టీ అయినాకూడా తమతో పొత్తుకు వస్తే తాము తప్పక ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.

Source:
http://telugu.webdunia.com/newsworld/news/apnews/0903/24/1090324086_1.htm
+3
Vote  Vote
Enter your comment:
Bharath 03-04-2009
if any body gives more information about bc front i ll really appriciate.i dont know about that
Rama 15-06-2009
Actually i dont know about bc united front

Search News

What's the News?

Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.