News »Browse Articles »
గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం: జయప్రకాష్
0
గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం: జయప్రకాష్
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా పట్టుదలతో పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఆ లక్ష్యాన్ని వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే చేరుకొనే దిశగా కృషి చేయాలని ఆయన ఉద్బోదించారు.
ముగిసిన ఎన్నికల ఫలితాలు, అభ్యర్థుల పనితీరుపై నియోజకవర్గాల వారీగా జేపీ సమీక్షా సమావేశాలు మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్‌సత్తా అభ్యర్థుల్లో చాలా మందికి రాజకీయాలు, ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలు డబ్బు, మద్యం పంపిణీ చేసినా, లోక్‌సత్తాకు ఓటు వేస్తే వృథా అవుతుందని విషప్రచారం చేసినా ఓటర్లు పట్టించుకోలేదన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో లోక్‌సత్తా అభ్యర్థికి ఎన్నో కొన్ని ఓట్లు పడ్డాయని, అంటే పార్టీ మారుమూల గ్రామాలకు కూడా చేరిందనడానికి ఇది నిదర్శనమని జేపీ అన్నారు. విజయానికి కావాల్సిన ఓట్లు కేవలం మంచితనం కారణంగా రావని, ప్రజల్లో మనకు ఉన్న ఆదరణను ఓట్ల రూపంలోకి మలచుకొనే సమర్థత కూడా ఉండాలన్నారు. కింది స్థాయి నుంచి నాయకత్వం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి వక్కాణించారు.

Search News
News Categories
What's the News?
Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.
Most Popular News
-
Corporate Employees Behind Lok Satta
Published about 05-02-2009 | Rated +7 -
విశాఖలో పురంధేశ్వర
ిపై
గంటా శ్రీనివాస్ పోటీ!
Published about 25-03-2009 | Rated 0 -
India can be transformed in 5 years: Dr. JP
Published about 20-03-2009 | Rated +5 -
లోక్‌సత్తా
తో
బీసీ యునైటెడ్ ఫ్రంట్ పొత్తు
Published about 25-03-2009 | Rated +3
Most Recent User Submitted News
- Election authorities expose Government duplicity On belt shopsâ closure: Dr. JP
Published about 20-03-2009 | Rated +1 - All parties promise top priority to education
Published about 08-03-2009 | Rated +2 - Blow the whistle and change history: Dr. JP
Submitted by Bharath | Rated +2 - Lok Satta better than TRS
Published about 19-05-2009 | Rated +1