See which of your colleagues or former colleagues are already on Loksatta Fans: Check out the Contact Finder
News »Browse Articles » విశాఖలో పురంధేశ్వరిపై గంటా శ్రీనివాస్ పోటీ!
0
Vote Vote

విశాఖలో పురంధేశ్వరిపై గంటా శ్రీనివాస్ పోటీ!

Views 60 Views    Comments 0 Comments    Share Share    Posted 25-03-2009  
విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కేంద్ర మంత్రి పురంధేశ్వరిపై ప్రజారాజ్యం పార్టీ తరపున గంటా శ్రీనివాస్‌రావు పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థుల ఎంపికలో ప్రజారాజ్యం పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తోంది.

కాంగ్రెస్‌లో టికెట్లు దక్కక తమ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చే అంగ, అర్థబలం ఉన్న నేతలకు ప్రజారాజ్యం పార్టీ సీట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. ప్రధానంగా విజయనగరం లోకసభ సీటును ఆశించి భంగపడిన పెన్మత్స సాంబశివరాజును పార్టీలో చేర్చుకుని ఆయన ఆశించిన సీటును కేటాయించే దిశగా ఆలోచనలు సాగిస్తోంది.

ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజును నర్సాపురం లోకసభ సీటు నుంచి పోటీకి దించేందుకు సిద్ధపడుతోంది. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కళ్యాణిని, మచిలీపట్నం నుంచి ముత్తంశెట్టి విజయనిర్మలను పోటీకి దించే యోచనలో ఉంది.

అలాగే అమలాపురం లోకసభ సీటును మాలమహానాడు నేత స్వర్గీయ పివి రావు భార్య ప్రమీలకు కేటాయించే అవకాశం ఉంది. కాగా, కొన్ని జనరల్ స్థానాల్లో సైతం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్రజారాజ్యం కృషి చేస్తోంది.

Source:
http://in.telugu.yahoo.com/News/Regional/0903/24/1090324023_1.htm
0
Vote  Vote
Enter your comment:
No Comments For This News

Search News

What's the News?

Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.

Most Recent User Submitted News