Loksatta Fans

See which of your colleagues or former colleagues are already on Loksatta Fans: Check out the Contact Finder
News »Browse Articles » బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్
0
Vote Vote

బాబు గారూ.. చర్చకు సిద్ధమా: జేపీ సవాల్

Views 2 Views    Comments 1 Comments    Share Share    Posted 08-07-2009  
లోక్‌సత్తా పార్టీపై అవినీతి ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ ఒక సవాల్ విసిరారు. తమ పార్టీ ఆవిర్భావం, రాజకీయం, క్రితం ఎన్నికల కోసం నిధుల సేకరణ, ఖర్చు తదితర అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఇందుకోసం చంద్రబాబు సిద్ధమేనా అంటూ ప్రశ్నిస్తూ బాబుకు జేపీ లేఖ రాశారు.

హేతుబద్ధమైన చర్చ ప్రజాస్వామ్యంలోని ప్రధాన అంతస్సూత్రమని లోక్‌సత్తా ఆది నుంచి చెపుతున్నట్టు జేపీ గుర్తు చేశారు. ఇరు పార్టీల నిధుల సేకరణ, పార్టీ విధానాలను చర్చించేందుకు తమ పార్టీ సిద్ధమని పేర్కొన్నారు. అయితే చర్చ వర్కింగ్ జర్నలిస్టుల సమక్షంలో జరిగితే మంచిదని ఆ లేఖలో బాబుకు జేపీ సూచించారు.

బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించడంతో పాటు విధి విధానాలను కూడా జేపీ ఖరారు చేశారు. ప్రజా జీవితంలో నైతికత, నిజాయితీ, రెండు పార్టీలు చేసిన రాజకీయం తీరు, రెండు పార్టీల రాజకీయ నిధుల సమీకరణ, వినియోగం, రెండు పార్టీలూ చేపట్టిన ప్రజా విధానాలు అనే అంశాలపై బహిరంగ చర్చకు బాబు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అధికార పార్టీతో కుమ్మక్కై లోక్‌సత్తా పార్టీ నడుచుకుంటోందని చంద్రబాబు ఇటీవల ఆరోపించిన విషయం తెల్సిందే. అంతేకాకుండా లోక్‌సత్తా ఖర్చు చేసిన రూ.56 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీయే సమకూర్చిందని బాబు ఆరోపించారు. దీనిపై జేపీ ఘాటుగానే స్పందించి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
0
Vote  Vote
Enter your comment:
Venu 06-08-2009
tdp are not agreed to this sawal. because they know if agreed what happend...........

their aim is just create neusense ok.........

Search News

What's the News?

Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.

Most Recent User Submitted News