See which of your colleagues or former colleagues are already on Loksatta Fans: Check out the Contact Finder
News »Browse Articles » పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు: జేపీ
0
Vote Vote

పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు: జేపీ

Views 0 Views    Comments 0 Comments    Share Share    Posted 18-08-2009  
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడమే కాకుండా దీర్ఘ దృష్టి కూడా లోపించిందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. కేవలం ప్రజల మన్నలు పొందేందుకే ఇబ్బడి ముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతోందని దుయ్యబట్టారు.

సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జేపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీని నివారణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితులను ఓ అవకాశంగా తీసుకుని భవిష్యత్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నంకాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

తెలంగాణా ప్రాంతంలో పడే 900 మిల్లీలీటర్ల సగటు వర్షపాతాన్ని సక్రంగా వినియోగించుకుంటే ఈ ప్రాంతాల్లో దుర్భిక్షమే ఉత్పన్నం కాబోదన్నారు. వర్షాల కోసం ప్రభుత్వం వరుణ యాగాలు చేస్తున్నట్టు చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని జయప్రకాష్ హితవు పలికారు.
0
Vote  Vote
Enter your comment:
No Comments For This News

Search News

What's the News?

Post a link to something interesting from another site, or submit your own original writing for the Loksatta Fans community to read.